శ్రీశైలం ప్రాజెక్టులో అడుగంటుతున్న నీటిమట్టం.. 48.57 టీఎంసీలకే నిల్వలు!

9 రోజుల్లో 3.03 టీఎంసీల నీరు తగ్గుదల.. వేసవిలో తాగునీటి కష్టాలపై ఆందోళన శ్రీశైలం, నవంబర్‌ 16 (ప్రజానేస్తం జ్వాల): శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. 215.80 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 48.57 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ప్రస్తుతం 829.10 అడుగులకు పడిపోయింది. గత తొమ్మిది రోజుల్లోనే 3.03 టీఎంసీల నీరు తగ్గగా, రోజుకు సగటున 0.33 టీఎంసీల మేర నిల్వలు పడిపోతున్నాయి. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి వరద ప్రవాహం నిలిచిపోవడంతో పాటు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం నగరాల...