బాలాజీనగర్‌లో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

మల్కాజ్‌గిరి, నవంబర్‌ 16 (ప్రజానేస్తం జ్వాల): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ డివిజన్ బాలాజీనగర్‌లో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయాన్ని పూలతో అలంకరించగా, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. వేడుకల్లో మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో బాలాజీనగర్‌లోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ వార్షికోత్సవాలు కేవలం...