కలం ఎవరికీ బానిస కాకూడదు!
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా... మీరు చెప్పిందే రాయాలనే షరతులు వద్దు.. మీకు నచ్చిందే చూపాలనే ఆంక్షలు వద్దు.. మీ భజన చేయలేదని నిందలు వేయకండి.. నిజాన్ని నిర్భయంగా రాసే స్వేచ్ఛను హరించకండి! పత్రిక అంటే కేవలం కాగితాల కట్ట కాదు.. ప్రజల గుండెల్లో దాగిన ఆవేదనకు అక్షరరూపం, బాధితుల కన్నీటికి గొంతుక, అధికారుల తప్పిదాలకు ప్రశ్నార్థకం! పదవుల ముందు తలవంచని కలం కావాలి.. పేదవాడి కన్నీటిని అక్షరాల్లో పలికించాలి.. మంచి చేసే మనిషికి అండగా నిలవాలి.. మారుమూల పల్లెల మూగవేదనను వెలుగులోకి తేవాలి.. అన్యాయం ఎక్కడ జరిగినా అక్షరంతో ఎదిరించాలి! అయితే స్వేచ్ఛ ఉందని ఇష్టారాజ్యంగా రాయకండి.. ఎదుటివారి స్వేచ్ఛను కించపరిచేలా వ్యవహరించకండి.. ఆతృతతో...