27వ సంకల్ప యాత్రలో భక్తులకు అన్నదాన కార్యక్రమం
మఠంపల్లి, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి 27వ సంకల్ప యాత్రలో భాగంగా మఠంపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో పాదయాత్ర చేస్తున్న భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో భక్తులకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొంటూ స్వామివారి సన్నిధికి తరలివెళ్తున్న భక్తులకు, స్వాములకు భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదం అందజేశారు. పాదయాత్రలో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం అందించడం ద్వారా నిర్వాహకులు తమ సేవాభావాన్ని చాటుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా...