ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు
భీమదేవరపల్లి, నవంబర్ 15 (ప్రజా నేస్తం జ్వాల): ఆర్యవైశ్యులంతా ఐకమత్యంతో ఉంటూ సంఘం బలోపేతానికి కృషి చేయాలని, పేదలకు సేవ చేయడంలో ముందుండాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోట సురేష్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం అశోక్ ముఖర్జీ తోటలో వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తోట సురేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఆటపాటలు, వివిధ వినోద కార్యక్రమాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వనభోజనాలను ఆనందంగా జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు సంఘ సభ్యుల మధ్య స్నేహసంబంధాలను...