హనుమకొండలో రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): విద్యుత్ లైన్ల మరమ్మతులు, అభివృద్ధి పనుల నేపథ్యంలో సోమవారం హనుమకొండ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈఈ సాంబారెడ్డి తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు భవానీనగర్, సెయింట్ పీటర్స్ స్కూల్ ప్రాంతం, కళ్యాణి ఫంక్షన్ హాల్ వెనుక ప్రాంతం, హౌసింగ్ బోర్డు, కేఎల్ఎన్ రెడ్డి కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అదేవిధంగా డ్రీమ్‌ల్యాండ్ ఫంక్షన్ హాల్, న్యూ రాయపుర ప్రాంతాల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని ముందుగానే గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి...