డిగ్రీ హాల్‌టికెట్లలో తప్పులకు కళాశాలలదే బాధ్యత: కేయూ పరీక్షల నియంత్రణాధికారి

హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): కాకతీయ యూనివర్సిటీ (కేయూ) డిగ్రీ సెమిస్టర్ పరీక్షల హాల్‌టికెట్లలో తప్పులు దొర్లిన అంశంపై ‘ప్రజానేస్తం జ్వాల’లో ప్రచురితమైన కథనానికి యూనివర్సిటీ అధికారులు స్పందించారు. హాల్‌టికెట్లలో తప్పులకు ఆయా డిగ్రీ కళాశాలలు నమోదు చేసిన వివరాలే కారణమని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కట్ల రాజేందర్ స్పష్టం చేశారు. విద్యార్థుల సబ్జెక్టులు, వ్యక్తిగత వివరాలను ఆయా డిగ్రీ కళాశాలలే నామినల్ రోల్స్ (ఎన్‌ఆర్) ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసి యూనివర్సిటీకి పంపిస్తాయని ఆయన తెలిపారు. కళాశాలలు పంపిన వివరాల ఆధారంగానే యూనివర్సిటీ పరీక్షల విభాగం హాల్‌టికెట్లను జారీ చేస్తుందని వివరించారు. కళాశాలల యాజమాన్యాలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో...