కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాలు.. డబ్బులు పంపవద్దని హెచ్చరిక

భూపాలపల్లి, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేరు, ఫొటోను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ ఖాతాల ద్వారా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ పేరుతో జిల్లా అధికారులు, సిబ్బందితో పాటు సామాన్య ప్రజలకు సందేశాలు పంపుతూ అత్యవసరంగా నగదు బదిలీ చేయాలని కోరుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ముఖ్యంగా 97398 11309 నంబర్ నుంచి తన పేరు, ఫొటోను ఉపయోగించి డబ్బులు పంపాలంటూ సందేశాలు వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ నంబర్‌తో పాటు తన పేరుతో ఇతర...