రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి: బృందా కారత్

నల్లగొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): నల్లగొండలోని ఎన్జీ కళాశాల ప్రాంగణం 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభలకు వేదికైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఎర్రజెండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ఎంపీ బృందా కారత్ ప్రసంగిస్తూ రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మతతత్వ రాజకీయాలకు ఆపాదించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆమె అన్నారు. నిజాం పాలన, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ పోరాటం చారిత్రకమైనదని పేర్కొన్నారు....