అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం
నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి నడికూడ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. అర్హులైన పేదలు, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నడికూడ మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులకు...