ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల అరుదైన ఘనత.. తల్లి గర్భంలోనే 25 వారాల పిండానికి స్పైనల్ సర్జరీ!
హనుమకొండ, 15 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల): భారత వైద్యరంగంలో అరుదైన ఘనత నమోదైంది. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్య బృందం తల్లి గర్భంలో ఉన్న 25 వారాల పిండానికి క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడైంది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ఓపెన్ ఫీటల్ సర్జరీ నిర్వహించినట్లు వచ్చిన సమాచారం వైద్యరంగంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పిండానికి 'లంబోసాక్రల్ మైలోమెనింగోసీల్' అనే జన్మసంబంధిత లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సమస్యలో వెన్నెముక పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడంతో వెన్నుపాము, దాని చుట్టూ ఉండే పొరలు బయటకు పొడుచుకు వస్తాయి. దీనివల్ల శిశువు పుట్టిన తర్వాత నరాల సంబంధిత సమస్యలు...