శబరిమల ప్రత్యేక రైళ్ల కేటాయింపులో కాజీపేటకు అన్యాయం?.. ఉమ్మడి వరంగల్ అయ్యప్ప భక్తుల ఆవేదన!
హనుమకొండ, 15 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల): శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించిన ప్రత్యేక రైళ్ల కేటాయింపుపై ఉమ్మడి వరంగల్ జిల్లా అయ్యప్ప భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రైళ్ల కేటాయింపులో కాజీపేట రైల్వే జంక్షన్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం నల్గొండ మార్గానికి 48 ట్రిప్పులు కేటాయించగా, అత్యంత రద్దీగా ఉండే కాజీపేట–ఖమ్మం మార్గానికి కేవలం 6 ట్రిప్పులు మాత్రమే కేటాయించడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప...