హనుమకొండ రాంపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. టైరు పేలి ఇన్నోవా బోల్తా.. ఏడుగురికి తీవ్ర గాయాలు!
హనుమకొండ, 15 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ సమీపంలోని రాంపూర్ స్టేజ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఇన్నోవా కారు ముందు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఎంటీ లింగాల శివకుమార్, అంబులెన్స్ పైలట్ సాదం కుమారస్వామి క్షతగాత్రులకు...