హుజూర్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి!
హుజూర్నగర్, 15 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్నగర్ పట్టణంలోని దీక్షిత్నగర్ సమీప బైపాస్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణానికి చెందిన పంగా నాగరాజు (40), ఎల్లవుల సురేందర్ ఇద్దరూ TS29C2968 నంబరు గల ద్విచక్ర వాహనంపై బైపాస్ రోడ్డును దాటుతున్నారు. అదే సమయంలో హుజూర్నగర్ నుంచి మిర్యాలగూడ వైపు AP39WK2449 నంబరు గల లారీని నడుపుకుంటూ వెళ్తున్న డ్రైవర్ అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న పంగా...