రెవెన్యూ ఉద్యోగులకు అన్ని స్థాయిల్లో పదోన్నతులు కల్పించాలి: లచ్చిరెడ్డి

హైదరాబాద్, నవంబర్‌ 14 (ప్రజానేస్తం జ్వాల): రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు అన్ని స్థాయిల్లో పదోన్నతులు కల్పించడంతో పాటు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ), సీసీఎల్ఏ లోకేష్‌కుమార్‌కు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 అదనపు కలెక్టర్ల పోస్టులను డిప్యూటీ కలెక్టర్లతో భర్తీ చేయాలని, 85 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. సీనియర్ అసిస్టెంట్ల నుంచి డిప్యూటీ తహశీల్దార్లుగా, డిప్యూటీ తహశీల్దార్ల నుంచి తహశీల్దార్లుగా పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జీఓ...