కొండగట్టు అంజన్న నిజరూప దర్శనానికి వేళాయె!
* నేటి నుంచి ఐదు రోజుల పాటు చందనం తొలగింపు ప్రక్రియ.. * ఈ నెల 21 నుంచి భక్తులకు నిజరూప దర్శనం కొండగట్టు, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న అంజన్న నిజరూప దర్శనానికి సమయం ఆసన్నమైంది. స్వామివారి మూలవిరాట్‌పై సుమారు 61 ఏళ్లుగా పేరుకుపోయిన చందనాన్ని తొలగించే ప్రత్యేక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఆలయ సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం నిర్వహించనున్నారు. చందనం తొలగింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 21వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ...