క్రమశిక్షణే జపాన్ విద్యావిధానంలో ప్రధాన లక్ష్యం

విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యం.. పరిశోధనలు, ప్రయోగాత్మక బోధనకు పెద్దపీట నవంబర్‌ 14 (ప్రజానేస్తం జ్వాల): జపాన్‌లో విద్యావిధానం ఇతర దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. విద్యార్థుల సమగ్ర అభ్యున్నతిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అక్కడి విద్యావ్యవస్థ రూపొందించారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యత, పరస్పర గౌరవం వంటి విలువలను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. పెద్దలతో పాటు తోటి విద్యార్థులను గౌరవించేలా వారిని తీర్చిదిద్దుతారు. అక్కడి విద్యావిధానంలో పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా పరిశోధనలు, ప్రయోగాత్మక బోధనకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులు స్వయంగా ఆలోచించి, ప్రశ్నించి, కొత్త విషయాలను అన్వేషించేలా ప్రోత్సహిస్తారు. ఉన్నత తరగతుల్లోకి వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా...