పోస్టల్ ఇన్సూరెన్స్ ఖాతాదారులకు అలర్ట్.. నవంబర్ 16 నుంచి 24 వరకు సేవలు నిలిపివేత!
హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) పాలసీదారులకు ఇండియా పోస్ట్ కీలక సమాచారం వెల్లడించింది. సాంకేతిక వ్యవస్థను ఆధునికీకరించే చర్యల్లో భాగంగా ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్ (IMS) సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయనున్న నేపథ్యంలో నవంబర్ 16 నుంచి 24వ తేదీ వరకు పోస్టల్ ఇన్సూరెన్స్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా పోస్టాఫీసులు, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్లు (CPCలు), ఆన్లైన్ పోర్టల్ ద్వారా పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ సేవలు అందుబాటులో ఉండవని ఇండియా పోస్ట్ ప్రకటించింది. పాలసీకి సంబంధించిన లావాదేవీలు, ఇతర సేవలపై ఈ అంతరాయం ప్రభావం చూపనుంది. ఖాతాదారులు...