వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడి కొరత.. రోగుల తీవ్ర ఇబ్బందులు!
హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): ఉత్తర తెలంగాణలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. ఎముకలు, కీళ్ల సంబంధిత సమస్యలతో చికిత్స కోసం వస్తున్న బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలుస్తోంది. వరంగల్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలు, మారుమూల ప్రాంతాల నుంచి అనేక మంది పేద రోగులు మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి వస్తుంటారు. ముఖ్యంగా ఎముకల విరుగుడు, కీళ్ల నొప్పులు, ప్రమాదాల్లో గాయపడిన వారు ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందేందుకు...