భూపాలపల్లి: ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు

భూపాలపల్లి, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల దరఖాస్తు గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు మహాదేవ్‌పూర్ మండల విద్యాధికారి (ఎంఈవో) ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కారణాలతో చదువును మధ్యలో నిలిపివేసినవారు, ఆర్థిక, కుటుంబ లేదా ఇతర పరిస్థితుల వల్ల రెగ్యులర్ విద్యను కొనసాగించలేకపోతున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంఈవో సూచించారు. ఓపెన్ స్కూల్ విధానం ద్వారా తమకు అనుకూలమైన రీతిలో విద్యను కొనసాగించి పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హతలు పొందేందుకు అవకాశం ఉంటుందని...