భద్రాచలం సీతారాముల కోటి తలంబ్రాల కోసం వరి కోత ప్రారంభం

11 ఏళ్లుగా కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయం.. రెండు రోజుల పాటు కోత కార్యక్రమం చెల్పూర్, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవానికి సమర్పించే కోటి తలంబ్రాల తయారీ కోసం ప్రత్యేకంగా సాగు చేసిన వరి పంట కోతను జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. శ్రీరామదాసు భక్తమండలి ఆధ్వర్యంలో తిరుపతమ్మ–తిరుపతి దంపతులు ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీతారాముల కల్యాణానికి సమర్పించే కోటి తలంబ్రాల తయారీ కోసం ప్రత్యేకంగా వరి సాగు చేయడం ఈ కార్యక్రమంలోని విశేషం. పంట కోతను భక్తిగీతాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభించారు. ఈ కోత కార్యక్రమం...