కేయూలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో ఆదివారం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 'గ్రంథాలయం – జ్ఞానానికి ద్వారం' అనే ఇతివృత్తంతో విద్యార్థులకు రంగవల్లుల (ముగ్గుల) పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో సుమారు 20 విద్యార్థి బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. వివిధ రంగులతో అందంగా తీర్చిదిద్దిన రంగవల్లుల ద్వారా పుస్తక పఠనం, విజ్ఞాన సముపార్జన, గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రతిబింబించారు. ప్రతి రంగవల్లిలోనూ పుస్తక పఠనం ద్వారా వ్యక్తిత్వ వికాసం, సమాజ అభివృద్ధి, జ్ఞాన విస్తరణ వంటి అంశాలను సృజనాత్మకంగా ఆవిష్కరించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి...