కాళోజీ కళాక్షేత్రం మొదటి అంతస్తుకు 'కుడా' కార్యాలయం తరలింపు!

హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) కార్యాలయం నూతన ప్రాంగణంలోకి మారుతోంది. హనుమకొండలోని ప్రతిష్ఠాత్మక కాళోజీ కళాక్షేత్రం మొదటి అంతస్తులో కుడా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న పాత కార్యాలయం నుంచి ఫైళ్లు, ఫర్నిచర్, ఇతర కార్యాలయ సామగ్రిని కొత్త భవనానికి తరలించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా చేపట్టారు. 16 నుంచి కొత్త చిరునామాలో సేవలు కార్యాలయ తరలింపు పనులను సిబ్బంది వేగవంతం చేశారు. ఫైళ్లను క్రమబద్ధీకరించి, అవసరమైన రికార్డులు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని కొత్త కార్యాలయంలోకి తరలిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ సోమవారం నుంచి కాళోజీ కళాక్షేత్రం మొదటి అంతస్తులోని నూతన...