ఈర్ష్య… ఇదేనా మానవత్వం?

ఈర్ష్య మనిషిని ఎదగనివ్వదు… ఇతరులు ఎదుగుతుంటే చూసి ఆనందించనివ్వదు! ఒకరి అభ్యున్నతికి చేయూతనివ్వలేం… వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంటే ఆ అడుగులను అడ్డుకోవాలని చూస్తాం! మనం ఎదగకపోయినా పర్వాలేదు… కానీ మరొకరు ఎదగడం మాత్రం సహించలేం. మన జీవితంలో వెలుగులు నిండకపోయినా ఫర్వాలేదు… పక్కవారి ఇంట దీపం వెలిగితే ఆ వెలుగును సైతం ఆర్పేయాలనుకుంటాం! మనం పస్తులున్నా పరవాలేదు… కానీ మరొకరు మూడు పూటలా తృప్తిగా భోజనం చేస్తుంటే మనసు మాత్రం అసూయతో రగిలిపోతుంది! వారి ఆనందంలో ఆనందాన్ని వెతకలేం… వారి విజయాన్ని మన విజయంలా భావించలేం… వారి అభివృద్ధిని చూసి స్ఫూర్తి పొందలేం… పైగా, వారిని వెనక్కి లాగేందుకు వెయ్యి కారణాలను వెతుకుతాం! ఎంత...