పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన గ్రంథాలయం ప్రారంభం

పాలెం, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారి విజ్ఞానాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ, ఉపసర్పంచ్ గోవిందు శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పుస్తక పఠనం వల్ల జ్ఞానం, విజ్ఞానం పెరగడమే కాకుండా ఆలోచనా శక్తి, భాషా...