ధర్మసాగర్‌లో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

ధర్మసాగర్, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): భారత తొలి ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ వేడుకలను ధర్మసాగర్ మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గంట సాంబరాజు ఆధ్వర్యంలో నెహ్రూ విగ్రహం వద్ద ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి, విద్యారంగ ప్రగతికి నెహ్రూ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ...