ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం

ఆసిఫాబాద్, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద 19 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులుగా ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా సదుపాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత వెల్లడించారు. జిల్లాలోని...