దళిత హక్కుల పోరాట సమితి 20వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

సూర్యాపేట, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): దళిత హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయ సాధన, సమానత్వ సమాజ నిర్మాణమే లక్ష్యంగా దళిత హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న 20వ వార్షికోత్సవాలను ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కే. ఏసురత్నం తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్‌లో వార్షికోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో నేటికీ కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు కొనసాగడం ఆందోళనకరమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు,...