పిల్లలు తమ మనసులో మాటను తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పాలి
నేటి తరం పిల్లల మనస్తత్వానికి అద్దం పట్టిన ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రం సూర్యాపేట, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థుల మనస్తత్వాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకొని వారితో స్నేహపూర్వకంగా మెలగాలని మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు త్రివేణి హరి, సూర్యాపేట జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడు బందు శ్రీధర్ బాబు సూచించారు. పిల్లలకు ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినప్పుడు మందలించకుండా, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అన్నారం గ్రామానికి చెందిన బొలిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో, ఆయన కుమారుడు జయంత్ హీరోగా, తనికెళ్ల భరణి...