పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి దాతల చేయూత

గోశాల, ఈ-హుండీ, క్యూలైన్లు, జమ్మిచెట్టు వద్ద అరుగు, గార్డెన్ల ఏర్పాటుకు ఆర్థిక సహకారం పాలెం, నవంబర్‌ 14 (ప్రజానేస్తం జ్వాల): నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని శ్రీ అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి పలువురు దాతలు ముందుకొచ్చి తమ వంతు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా మొక్కులు సమర్పించుకునేందుకు వీలుగా ఈ-హుండీని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. శనివారం ఆలయ అభివృద్ధి పనులను జున్న శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ గోకులం...