మున్సిపల్ స్థలంలో ప్రైవేటు పెత్తనం.. వీధి వ్యాపారులపై వేధింపులు!
• నెలకు రూ.1,500 ఇవ్వాలంటూ బెదిరింపులు. • కూరగాయలు నేలపాలు చేశారని వ్యాపారుల ఆరోపణ • దౌర్జన్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు: మున్సిపల్ కమిషనర్ నాగరాజు నేరేడుచర్ల, నవంబర్ 14 (ప్రజానేస్తం/జ్వాల):నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని జాన్పహాడ్ రోడ్డులో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ స్థలంగా ప్రచారంలో ఉన్న ఈ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీధి వ్యాపారులపై ఓ ప్రైవేటు వ్యక్తి పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే ఒక్కొక్కరు నెలకు రూ.1,500 చెల్లించాలని ఒత్తిడి చేస్తూ, డబ్బులు ఇవ్వకపోతే వ్యాపారాలు చేసుకోనివ్వబోమని బెదిరిస్తున్నారని బాధిత వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నెలవారీ డబ్బుల కోసం...