పరకాల ఇందిరా మహిళా డైరీకి 10 ఎకరాల భూమి కేటాయింపు.. సీఎం రేవంత్ రెడ్డికి మహిళల పాలాభిషేకం

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం మహిళల ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా డైరీ దోహదపడుతుంది: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దామెర, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): పరకాల ఇందిరా మహిళా డైరీకి 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో దామెర మండల కేంద్రంలో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం డైరీ ప్లాంట్ ఆవరణలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా...