ఐనవోలు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన వరంగల్ సీపీ ఎన్. శ్వేత

రికార్డులు, కేసుల వివరాల పరిశీలన.. పోలీసు సిబ్బందికి పలు సూచనలు ఐనవోలు, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ శుక్రవారం ఐనవోలు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆమెకు పోలీస్ అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలకగా, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ కొబ్బరి మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను చాటారు. రికార్డుల పరిశీలన.. సిబ్బందికి దిశానిర్దేశం ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల వివరాలు, రిజిస్టర్లను సీపీ క్షుణ్ణంగా పరిశీలించి వాటి నిర్వహణ తీరును సమీక్షించారు. పోలీసు సిబ్బంది...