తీన్మార్ మల్లన్నకు ప్రాణహాని కలిగించే కుట్రలను సహించేది లేదు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపడుతున్న బీసీ రాజ్యాధికార పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు రాజకీయ శక్తులు ఆయనపై దాడులకు కుట్రలు చేస్తున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. నేటి పాదయాత్ర సందర్భంగా తీన్మార్ మల్లన్న ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనాన్ని లారీతో ఢీకొట్టేందుకు ప్రయత్నం జరిగిందనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని...