భూపాలపల్లిలో అంబేద్కర్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు వినతిపత్రం అందజేసిన VCK యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్ భూపాలపల్లి, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కోచింగ్ సెంటర్–స్టడీ సర్కిల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ VCK యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన కరపత్రాన్ని కూడా ఎమ్మెల్యేకు అందించారు. ఈ సందర్భంగా అంబాల అనిల్ కుమార్ మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఇతర...