రుణగ్రహీతలకు వడ్డీ రేట్ల పెంపు భయం.. రెపో రేటుపై ఆర్బీఐ నిర్ణయంపై ఉత్కంఠ

డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఎంపీసీ సమావేశం.. మరోసారి పెరిగితే ఈఎంఐల భారం అధికమయ్యే అవకాశం హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): రుణగ్రహీతలకు మరోసారి వడ్డీ రేట్ల పెంపు భయం వెంటాడుతోంది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి రెపో రేటును పెంచే అవకాశాలున్నాయని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడనుంది. 0.25 నుంచి 0.50 శాతం పెంపుపై అంచనాలు తాజా సమావేశంలో రెపో రేటును 0.25 శాతం నుంచి 0.50...