వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): పోలీస్ శాఖలో పరిపాలనాపరమైన మార్పుల్లో భాగంగా పలువురు ఇన్‌స్పెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఐజీపీ సంపత్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని బోర్డు సిఫార్సుల మేరకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కాసగాని శ్రీధర్‌ను ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్‌కు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ముత్యం రమేష్‌ను మల్టీజోన్-1 ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఖమ్మం సీసీఆర్‌బీ, సీటీసీ విభాగాలకు పోస్టింగ్‌లు కల్పించిన బొమ్మెర బాలకృష్ణ, రాడం భానుప్రకాశ్‌ల పోస్టింగ్‌లను రద్దు చేశారు. వారిని వెయిటింగ్‌లో ఉంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి.