పోలీస్ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

నాగర్‌కర్నూల్, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): పోలీస్ సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీస్ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం తుడుకుర్తిలోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎంటీఓ రాఘవరావు, ఏఎంటీఓ గౌస్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వైద్య నిపుణులు పోలీస్ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు చేసి, కంటి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. వాహనాలను సురక్షితంగా నడపడానికి స్పష్టమైన కంటిచూపు ఎంతో అవసరమని, డ్రైవర్లు నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు...