కారుకొండ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

బిజినపల్లి, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని కారుకొండ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడో తరగతి విద్యార్థి ఎం.డి. సుభహాన్ నెహ్రూ వేషధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 17 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ, ఇంద్రాణి, భాగ్యలక్ష్మి, శ్రీకాంత్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.