ఉన్నత విద్యపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

చదువు మధ్యలో మానేయకుండా లక్ష్యంతో ముందుకు సాగాలి.. విద్యార్థులకు వ్యవసాయ విద్యార్థినుల సూచన కీతవారిగూడెం, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థులు పదో తరగతి తర్వాత ఉన్నత విద్యలో సరైన కోర్సులను ఎంచుకుని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థినులు సూచించారు. గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని సీహెచ్‌ఎస్‌డీ సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలకు చెందిన బీఎస్సీ వ్యవసాయ శాస్త్రం చివరి సంవత్సరం విద్యార్థినులు కీతవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య, భవిష్యత్తు అవకాశాలపై అవగాహన కల్పించారు. పదో తరగతి పూర్తయిన తర్వాత...