లట్టుపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ
లబ్ధిదారురాలి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించిన సర్పంచ్ మారేపల్లి శివలీల చంద్రగౌడ్ బిజినపల్లి, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలోని ఊరగడ్డ ప్రాంతంలో రాగణమోని లలిత–యాదయ్య దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మారేపల్లి శివలీల చంద్రగౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పుల్లయ్య, మాజీ...