వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!
వృద్ధాప్యంలో భరోసా, ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు – జిల్లా సంక్షేమ శాఖ అధికారి కందిబండ నరసింహారావు సూర్యాపేట, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించడంతో పాటు వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ పలు చర్యలు చేపడుతోందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి కందిబండ నరసింహారావు తెలిపారు. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సయోధ్య డేకేర్ సెంటర్లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వృద్ధులకు పింఛన్లు అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వయోవృద్ధుల హక్కులకు రక్షణ కల్పించి, వారి జీవితాలకు భద్రత...