నిషానీ గ్రామంలో ఘనంగా దండారి ఉత్సవాల ముగింపు!
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన కొలబోడింగ్ వేడుకలు.. ఏడు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు కెరమెరి, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని నిషానీ గ్రామంలో వారం రోజుల పాటు సంప్రదాయబద్ధంగా సాగిన దండారి ఉత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు అత్యంత పవిత్రంగా భావించే ఈ ఉత్సవాలను ఏటా ఏడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిషానీ గ్రామంలో కొలబోడింగ్ కార్యక్రమాన్ని ఆదివాసీ ఆచార వ్యవహారాల ప్రకారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గుస్సాడీ నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాల మోత, ప్రత్యేక...