సూర్యాపేటలో రూ.25 లక్షల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్!

ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమ రవాణా.. ఇన్నోవాలో 112 కిలోల గంజాయి స్వాధీనం పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఎస్కార్ట్‌గా మరో కారు.. పరారీలో ముగ్గురు నిందితులు సూర్యాపేట, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టు చేశారు. జాతీయ రహదారి 65పై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన ఇన్నోవా కారును తనిఖీ చేయగా 112 కిలోల గంజాయి బయటపడింది. సుమారు రూ.25 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. శుక్రవారం...