# సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు!
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను ప్రభుత్వం మరో పోస్టుకు బదిలీ చేయడంపై మాజీ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్ట్ పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీ పదవి నుంచి బదిలీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌కు నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. తన మాజీ సహోద్యోగిని ‘పోలీసు యూనిఫాంలో ఉన్న నేరస్థుడు’ అని విమర్శించాల్సి రావడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత స్నేహబంధం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు....