మల్లారంలో పారిశుద్ధ్య సమస్య.. పట్టించుకునేదెవరు?

చెత్త తొలగింపులో జాప్యంపై గ్రామస్థుల అసంతృప్తి.. కార్మికుల విధుల నిర్వహణపై ఫిర్యాదులు భీమదేవరపల్లి, ప్రజానేస్తం జ్వాల: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై గ్రామ పంచాయతీ అధికారులు మరింత దృష్టి సారించాలని కోరుతున్నారు. గత బుధవారం సాయంత్రం గ్రామంలో వారసంత నిర్వహించారు. సంత ముగిసిన తర్వాత కూరగాయల వ్యర్థాలు, ఇతర చెత్తను పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో రహదారులపై చెత్త పేరుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు విధులకు సక్రమంగా హాజరవుతున్నారా? వారికి కేటాయించిన పనులు సక్రమంగా జరుగుతున్నాయా? అనే అంశాలపై...