లక్ష ఎకరాల్లో పంటల మార్పిడికి సన్నాహాలు!

రైతులకు మేలు చేసే పంటల సాగుపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ వచ్చే పంటలపై అవగాహన విజయవంతమైన రైతుల అనుభవాలతో ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ సూర్యాపేట, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా, భూమికి అనువైన ఇతర పంటలను కూడా సాగు చేసేలా ప్రోత్సహించేందుకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వచ్చే యాసంగి (2026–27) సీజన్‌లో జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటల మార్పిడి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు ఏ పంట వేస్తే తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి, మెరుగైన ఆదాయం వస్తుందనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్ తేజస్...