ముల్కనూర్‌లో ఘనంగా నాగుల చవితి వేడుకలు!

భీమదేవరపల్లి, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో నాగుల చవితి పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని సమ్మక్క గద్దెల సమీపంలో కొలువై ఉన్న శ్రీ నాగేశ్వరీ ఆలయం భక్తుల సందడితో కిటకిటలాడింది. నాగుల చవితిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే ముల్కనూర్‌తో పాటు పరిసర గ్రామాలకు చెందిన మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని నాగుపుట్ట వద్ద పాలు పోసి, కొబ్బరికాయలు సమర్పించి, పసుపు, కుంకుమలు, పూలు, నైవేద్యాలతో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ...