గణేష్ చౌక్ అగ్నిప్రమాద బాధితులకు న్యాయం చేయాలి.. లేకుంటే ప్రజా ఉద్యమం

ఐదు దుకాణాలు దగ్ధం.. రూ.12 లక్షల ఆస్తి నష్టం బాధితులకు తక్షణ పరిహారం, ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని రవి పటేల్ డిమాండ్ జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 12 (ప్రజానేస్తం జ్వాల): జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ రోడ్డుపై ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు ఫుట్‌పాత్ దుకాణాలు పూర్తిగా దగ్ధమై, సుమారు రూ.12 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గురువారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన బాధిత దుకాణ యజమానులను పరామర్శించి, నష్ట వివరాలు తెలుసుకున్నారు....