పేదరికం నుంచి చైర్మన్ స్థాయి వరకు.. విమర్శలతో ఆగని ప్రస్థానం!
ఎదుగుదల వెనుక కష్టం చూడాలి.. ప్రజలకు చేసిన సేవలను గుర్తించాలి! ఒకప్పుడు పేదరికంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తి.. నేడు తన కష్టాన్ని, పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని చైర్మన్ స్థాయికి ఎదిగితే అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో అవమానాలు, అపజయాలు, ఆర్థిక ఇబ్బందులు, అనేక సవాళ్లు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించి ప్రజల్లో గుర్తింపు సంపాదించడం ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదు. ఎదిగిన వ్యక్తి నేటి హోదాను మాత్రమే చూసి విమర్శించే ముందు.. ఆ స్థాయికి చేరుకోవడానికి ఆయన చేసిన పోరాటాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దొంతగాని శ్రీనన్న గురించి మాట్లాడే వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన...